నాచారంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

HYD: నాచారంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను బండారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పండ్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం ఆరవ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.