మోదీకి ట్రంప్ ఫోన్.. గల్ఫ్ యుద్ధంపై చర్చ

మోదీకి ట్రంప్ ఫోన్.. గల్ఫ్ యుద్ధంపై చర్చ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ప్రధాని మోదీ 'X' వేదికగా తెలిపారు. 'పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై మేము చర్చించాం. అక్కడ ఉద్రిక్తతలు తగ్గి, త్వరగా శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. హార్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండటం ప్రపంచం మొత్తానికి అవసరం. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం నిరంతరం టచ్‌లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము' అని పేర్కొన్నారు.