పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగర మేయర్
నెల్లూరు సిటీ 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో మేయర్ సుజాత పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను పర్యవేక్షించారు. దోమల నివారణ మందు పిచికారీ, ఫాగింగ్ ప్రక్రియలను క్రమం తప్పకుండా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.