జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన గోవిందారం విద్యార్థి
JGL: భీమారం మండలం గోవిందారం ప్రభుత్వ జడ్పీ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి విఘ్నేశ్ సాఫ్ట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం అశ్వక్, పీడీ ప్రశాంత్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి విఘ్నేశ్ ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని DEO రాము అభినందించారు.