పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాసులు బాధ్యతలు

NLR: వింజమూరు మండల ఈవోపీఆర్డీగా గోపి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు వింజమూరు మేజర్ పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి శివకుమార్ కోవూరులో అవినీతి అక్రమాలు పాల్పడిన విషయం విచారణలో తేలడంతో ఉన్నత అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.