నాగోబా జాతరలో మరో ప్రధాన ఘట్టం గిరిజన దర్బార్

ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో సాగుతున్న సందర్భంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శుక్రవారం దర్భార్ నిర్వహిస్తున్నందున ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా ఆరు వందల మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. దర్బార్ నేపథ్యంలో బందోబస్తుపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.