భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

GDWL: కేటి దొడ్డి మండలం ఇక్కిచేడు గ్రామంలో బుధవారం భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు వర్షిత్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13న నిర్వహించనున్న '4వ అంబేడ్కర్ ఆలోచన పండుగ'కు సంబంధించి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.