2వ విడతలో 14 సర్పంచ్, 30 వార్డ్‌లకు నామినేషన్‌లు దాఖలు
MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో 2వ విడత నామినేషన్ల ప్రక్రియ మొదటిరోజు ఆదివారం ప్రారంభమైంది. 7మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలకు 14 నామినేషన్లు దాఖలు కాగా, 996 వార్డులకు 30 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.