తెలుగు వర్సిటీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
GDWL: తెలుగు విశ్వవిద్యాలయం వసతి గృహంలో విషాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి (M) శాంతినగర్‌కు చెందిన పద్మ కుమారుడు పరశురాం (20) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.పెద్ద కుమారుడు పరశురాం బాచుపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు వర్సిటీలో బి.డిజైన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.