VIDEO: గుడివాడలో అంబేద్కర్ వర్ధంతి
కృష్ణా: గుడివాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. ఈ సందర్భంగా నేతలు అంబేద్కర్ బోధించిన “విద్యను బోధించు, ఉద్యమించు, సంఘటితం చేయు” అనే సందేశాన్ని స్మరించుకున్నారు.