సింహాచలం ఘటన దురదృష్టకరం: నారాయణరావు

సింహాచలం ఘటన దురదృష్టకరం: నారాయణరావు

కృష్ణ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతిచెందిన ఘటన దురదృష్టకరమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు బుధవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వర్షాల కారణంగానే గోడ కూలి ఘటన జరిగిందన్నారు.