'పంటల కొనుగోలు సాఫీగా కొనసాగుతోంది'
NRML: జిల్లా స్థాయిలో పంటల కొనుగోలు సాఫీగా సాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇంకా ప్రారంభం కాని కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. టార్పలిన్‌లు, గన్ని సంచులు, తూకపు యంత్రాలు సమృద్ధిగా ఉంచాలని సూచించారు. రైతులు ప్రభుత్వ కేంద్రాలకే పంటలు అమ్మాలని, ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 91829 58858 సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.