యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

MNCL: మందమర్రి మండలంలో రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో క్యూలో నిల్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరిపడ యూరియా సరఫరా కాకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందించాలని కోరారు.