ACB అధికారులకు పట్టుబడిన వీఆర్వో
ఏలూరు జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ అధికారిణి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ధృవీకరణ సర్టిఫికెట్‌కు సంబంధించి గన్నంపల్లి వీఆర్వో చంద్రలీల ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి ACB అధికారులను ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.