కొత్తవలస బ్రిడ్జి నుండి రాకపోకలను నిలిపిన కలెక్టర్

మన్యం: జిల్లాలో సీతానగరం-మక్కువ మండలాలను కలిపే కొత్తవలస బ్రిడ్జి పైనుండి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బ్రిడ్జిపై నుండి రాకపోకలను నిలిపివేయాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ బ్రిడ్జితో పాటుగా మరో 12 బ్రిడ్జిలను వర్షాలు తగ్గేవరకు మూసివేయలని అధికారులకు ఆదేశించారు.