RTPPలో 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

KDP: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో నాలుగు యూనిట్లలో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారు. RTPPలో 210X5MW, 610X1MW విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. వీటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 1,660MW. అయితే వీటిలో కొద్దిరోజులుగా 2,3,4,5 యూనిట్లను షట్ డౌన్ చేశారు. 1, 6యూనిట్లలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.