రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన అ. కలెక్టర్

రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన అ. కలెక్టర్

మేడ్చల్: జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మంగళవారం కిష్టాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆమె, బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి చదవాలని సూచించారు. కంప్యూటర్లు, ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.