ఈ నెల 23న హిందువుల ఐక్యత సమ్మేళనం
ADB: పట్టణంలో హిందువుల ఐక్యత కోసం పలు సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈనెల 23న వినాయక్ చౌక్ సరస్వతీ శిశు మందిర్‌లో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రిని నిర్వాహకులు గురువారం ఆహ్వానించి కరపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాజశ్రీ, నర్సింలు, దశరథ్, స్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.