VIDEO: ఉద్రిక్తత.. పోలీసులపై కాకాణి ఫైర్
NLR: వైసీపీ తలపెట్టిన 'చలో జువ్వలదిన్నె' కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. 'పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారు. అదే ప్రాంతానికి టీడీపీ నేతలను దగ్గరుండి తీసుకెళ్తున్నారు. వైసీపీకి ప్రత్యర్థి కూటమి ప్రభుత్వం కాదు.. ఈ పోలీసులే' అని ఆయన మండిపడ్డారు.