చౌలమద్దిని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి
JGL: మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన, రికార్డులు పూర్తి స్థాయిలో సక్రమంగా ఉంచుకోవాలని, అలాగే గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.