అక్రమ పార్కింగ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
NRML: భైంసా పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రహదారులపై అక్రమంగా నిలిపిన వాణిజ్య వాహనాలను తొలగించి జరిమానాలు విధించారు. ఈ చర్యలతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని స్థానికులు తెలిపారు. భవిష్యత్తులోనూ క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.