'శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుండాలి'
ASR: నేటి సమాజంలో మహిళలందరూ శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుండాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎన్ రసూల్ పేర్కొన్నారు. విద్యార్థినులందరూ మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు. నేటి యువత స్త్రీలను గౌరవించాలని సూచించారు.