ఈనెల 23న కబడ్డీ జట్ల ఎంపిక
MBNR: ఈనెల 23న జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో స్త్రీ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శాంత కుమార్, కురుమూర్తి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. పురుషులు బరువు 85 కిలోలు, స్త్రీలు 75 కిలోల లోపు ఉండాలన్నారు.