ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

MDK: మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయడం సంతోషకరమని బొద్దుల కృష్ణ అన్నారు. శనివారం మెదక్ పట్టణం మార్కెట్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూరగాయలు పండించే రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తైబజార్ రద్దు చేశారని, రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.