'సీనియర్ల విమర్శలను సూచనలుగా స్వీకరిస్తా'
సీనియర్ ప్లేయర్ల విమర్శలను సూచనలుగా స్వీకరించి ఆటను మెరుగుపరుచుకుంటానని భారత క్రికెటర్ KL రాహుల్ తెలిపాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ KPతో మాట్లాడుతూ.. 2021లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నానని, 'పవర్ ప్లేలో నా ఆట బోరింగ్ అని మీరే విమర్శించారు' అని గుర్తుచేశాడు. ఒకప్పుడు తన పరిస్థితిలో ఉన్న KP లాంటి మాజీ ప్లేయర్లు చేస్తున్న విమర్శల్లో అర్థం ఉంటుందని భావిస్తానన్నాడు.