అన్ని పార్టీలకూ వర్తించేలా బిల్లు: కిషన్ రెడ్డి

లోక్‌సభలో ప్రతిపక్ష కూటమి సభ్యుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నేరాభియోగాలు ఉన్న వారిని పదవి నుంచి తొలగించే బిల్లును దేశమంతా స్వాగతిస్తుందని ఆయన అన్నారు. ఈ బిల్లు కేవలం కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం కాదు.. అన్ని పార్టీలకు వర్తించేలా తీసుకువచ్చామని స్పష్టం చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వారు భుజాలు తడుముకుంటున్నారు విమర్శించారు.