'పాపన్నగౌడ్ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

HYD: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రకాష్ గౌడ్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315వ వర్ధంతిని పురస్కరించుకొని చేవెళ్లలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.