గుంతల రహదారికి మరమ్మతులు

KRNL: ఆస్పరి మండలం చిగలి గ్రామం ప్రధాన రహదారికి ఎమ్మెల్యే విరుపాక్షి ఆదేశాలతో నాయకులు, అధికారులు ఆదివారం ప్యాచ్ వర్క్‌లు చేశారు. ఈ నెల 23న శ్రీగిరి కట్టెల తిప్పన జాతర సందర్భంగా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో రహదారికి మరమ్మతులు చేశామన్నారు. గుంతల ప్రదేశంలో తారు వేసి గుంతలను పూడ్చారు.