అమరావతికి చట్టబద్ధతపై ఎంపీ లావు హర్షం
AP రాజధానిగా అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. 2015లోనే అమరావతిని రాజధానిగా గుర్తించామని, అయితే 2019-2025 మధ్య గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిందని విమర్శించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు 2026 ద్వారా అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తూ పార్లమెంట్‌లో న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.