కాంగ్రెస్‌లోకి జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి

కాంగ్రెస్‌లోకి జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి

MBNR: జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుంది. జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అమరచింత ఎమ్మెల్యేగా స్వర్ణ సుధాకర్ రెడ్డి పనిచేసి, తెలంగాణ ఏర్పాటు తర్వాత BRSలో చేరారు. 2019లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో భూత్పూర్ మండలం నుంచి BRS తరఫున పోటీ చేసి గెలిచారు.