VIDEO: ఉప్పల్ రోడ్ల పై అక్రమ పార్కింగ్.. చర్యలేవి..?
MDCL: ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ పరిసరాల్లో రోడ్లపై అక్రమ పార్కింగ్ పెరుగుతోంది. ప్రధాన రహదారులపై కార్లు, బైకులు అడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.