ఆసుపత్రిలో బంగారు పుస్తెలతాడు అపహరణ
NGKL: అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పుస్తెలతాడు అపహరణకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ వద్దకు రాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆయాగా నటిస్తూ వచ్చి మాయమాటలు చెప్పి రెండు తులాల బంగారు పుస్తెలతాడును తీసుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.