సీపీఐ తెలంగాణ వార్షికోత్సవ సభ

RR: షాద్ నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో తెలంగాణ వార్షికోత్సవ నియోజకవర్గ సభను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తిని కొనసాగించే పద్ధతిలో మన పోరాటాలు ఉండాలన్నారు.