ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ప్రకాశం: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పొన్నలూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మేరకు ముత్తరాజుపాలెం - ముప్పాళ్ళ మధ్య బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకయ్య అనే వ్యక్తి మృతి చెందారు. రామకృష్ణ, వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.