అడవిపంది ఢీకొట్టి రైతు మృతి

NLR: లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటుపల్లి గ్రామానికి చెందిన కర్ణం నరసింహ (55) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయనను అడవిపంది ఢీకొట్టింది. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయాలవడంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారని పోలీసులు తెలిపారు.