జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో 'శ్రీ పరాభవ నామ' సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, సిబ్బందికి ఉగాది పచ్చడి, మిఠాయిలు పంపిణీ చేశారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమం జరిగింది.