RO మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
VZM: ప్రయాణికులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఆర్టీసీ బస్ స్టేషన్లో RO మినరల్ వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి ప్రారంభించారు. రోటరీ ఇంటర్నేషనల్ విజయనగరానికి చెందిన డి. నారాయణమూర్తి సౌజన్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ విజయనగరం గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.