బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

అన్నమయ్య: రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్షుడిగా వై. రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీ. రెడ్డి భాష 40 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రభాకర్ రెడ్డి ప్యానెల్ నుంచి 7 మందిలో 6 మంది విజయం సాధించగా, మొత్తం 116 ఓట్లలో 110 ఓట్లు పోలయ్యాయి. సహాయ కార్యదర్శిగా వీ. సిద్దయ్య, స్పోర్ట్స్ సెక్రటరీగా టీవీ రమణ గెలుపొందారు.