హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించాలి: కలెక్టర్
ADB: భారీ వర్షాలకు ADB అర్బన్‌లో జలమయమైన లో లెవల్ బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సోమవారం సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి శాశ్వత పరిష్కార మార్గంపై చర్చించారు.