వ్యాన్ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

వ్యాన్ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

SKLM: రొయ్యల వ్యాన్ ఢీకొట్టడంతో సంతబొమ్మాళి మండలం కాపుగోదయవలస గ్రామానికి చెందిన నందిగాం కాళీ దుర్గాప్రసాద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో బోరుభద్రలోని వినాయకుడు గుడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడు బోరుభద్రలోని పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.