30మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

30మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

కృష్ణా: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం తమ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు రూ. 20,62,587ల చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం పేదల దరఖాస్తులను సీఎం చంద్రబాబు వేగంగా స్పందిస్తూ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.