'గర్భిణులకు సురక్షిత ప్రసవమే లక్ష్యంగా సేవలు చేయాలి'

'గర్భిణులకు సురక్షిత ప్రసవమే లక్ష్యంగా సేవలు చేయాలి'

PPM: సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మాతా, శిశు ఆరోగ్యంపై సమీక్షా సమావేశాన్ని ఆరోగ్య కార్యాలయంలో నిన్న నిర్వహించారు. గర్భిణీలకు నిర్దేశించిన ప్రతి ఆరోగ్య కార్యక్రమాన్ని పక్కగా అమలు జరిపి మెరుగైన వైద్యసేవలు అందేలా క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.