విశాఖ జైలులో గంజాయి మొక్క: అనిత

AP: విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించిందని హోంమంత్రి అనిత అన్నారు. జైలులో ఖైదీలు మొబైల్స్ వాడటంపై విచారణ జరుగుతోందని చెప్పారు. వాటిని ఎవరు వాడారో తేలుస్తామని వివరించారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.