ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శాంతి

ఆరోగ్యశ్రీ  స్మార్ట్‌ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శాంతి

శ్రీకాకుళం: పాతపట్నం మండల కేంద్రంలో సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా ఆరోగ్యం నిమిత్తం అప్పుల పాలు కాకూడదనే ఆరోగ్యశ్రీ పథకంలో కొత్త సంస్కరణలకు జననేత సీఎం జగన్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు.