నీటి భద్రత మన బాధ్యత: మంత్రి
SKLM: నీటి భద్రత మన బాధ్యతని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడలో ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటిభద్రత మనబాధ్యత పథకానికి ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు తాగునీరు, స్నానాలకు ఇతర అవసరాలకు నీరు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.