దేశంలో ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ: ఎమ్మెల్యే

దేశంలో ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ: ఎమ్మెల్యే

BDK: భారతదేశంలో ఐటీ రంగానికి మొట్టమొదటిగా పునాది వేసిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీది అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా బుధవారం భద్రాచలం పట్టణంలోని కూనవరం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి ఆశయాలను ముందుకు నడిపించడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.