భూములకు రక్షణ కవచంలా భూ భారతి చట్టం

HYD: భూ భారతి చట్టం భూములకు రక్షణ కవచం లాంటిదని, రైతులకు భూ భద్రత కల్పిస్తుందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కార్యాలయంలో భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సులో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. భూ భారతి ఆర్ఆర్ నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాయని తెలిపారు.