వీరాపూర్‌లో సామాజిక తనిఖీ

వీరాపూర్‌లో సామాజిక తనిఖీ

KMR: బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందం ఇవాళ తనిఖీ చేసింది. ఉపాధి హామీ కూలీల ఇంటింటికి వెళ్లి జరిగిన పనులపై, పని వేతనాలపై వారితో BRP దానియల్, VRP విష్ణు చర్చించారు. ఉపాధి హామీ పనుల్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.