యుద్ధం.. దుబాయ్‌లో హై అలర్ట్
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంపై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో UAE ప్రభుత్వం, దుబాయ్ భద్రతా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఇవాళ దుబాయ్‌లోని నివాసితులు, పర్యాటకుల ఫోన్లకు అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపారు. ఎప్పుడైనా క్షిపణుల దాడి జరగొచ్చని అప్రమత్తంగా ఉండాలన్నారు.