VIDEO: నిండుకుండలా ప్రవహిస్తున్న కృష్ణమ్మ తల్లి

GDWL: జిల్లాలోని గద్వాల రైల్వే స్టేషన్, ఆరేపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రవహించే కృష్ణానది నిండుకుండలా కళకళలాడుతోంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, ఇది తమ పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నదిలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇది తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా, రాబోయే రోజుల్లో రబీ పంటలకు కూడా ఉపయోగపడుతుందనరు.